కళింగ యుద్ధం గురించి అశోకుని 13వ ప్రధాన రాతి శాసనం సమగ్రంగా వివరిస్తుంది. అశోకుని పేరును స్పష్టంగా పేర్కొన్న శాసనాలు: మాస్కీ, గుర్జర, నిట్టూరు, ఉడేగోళం (మిగతా వాటిలో 'దేవానాంప్రియ ప్రియదర్శి' అని ఉంది).
రుమ్మిండేయి స్తంభ శాసనం (నేపాల్) బుద్ధుని జన్మస్థల గౌరవార్థం లుంబిని గ్రామంలో పన్నులు (బలి రద్దు, భాగాన్ని 1/8కి తగ్గింపు) తగ్గించిన ఆర్థిక శాసనం. ధర్మ ప్రచారం కోసం పట్టాభిషేకమైన 14వ ఏట 'ధర్మ మహామాత్రులు' అనే ప్రత్యేక అధికారులను నియమించాడు.
