← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › బౌద్ధ మతం - గౌతమ బుద్ధుని జీవితం మరియు తత్వశాస్త్రం

చతురార్య సత్యాలు మరియు అష్టాంగ మార్గం

Topic 3 of 4 in బౌద్ధ మతం - గౌతమ బుద్ధుని జీవితం మరియు తత్వశాస్త్రం. Read this note, then practice its questions.

By exambadi.inNote 03 / 04

బుద్ధుని మూల సిద్ధాంతం 'చతురార్య సత్యాలు': 1. సర్వం దుఃఖమయం (దుఃఖం) 2. దుఃఖ సముదయం (కోరికలే దుఃఖానికి మూలకారణం) 3. దుఃఖ నిరోధం (కోరికలను జయించడం ద్వారా దుఃఖ నివారణ) 4. దుఃఖ నిరోధ గామిని ప్రతిపద (అష్టాంగ మార్గం).

అష్టాంగ మార్గం: సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. బౌద్ధం తీవ్ర తపస్సును, మితిమీరిన భోగాలను కాదని 'మధ్యమ మార్గం' (Middle Path) బోధించింది.

ప్రతీత్య సముత్పాదం (కారణ-కార్య సిద్ధాంతం) బౌద్ధ తాత్విక పునాది.