బౌద్ధ మతంలో త్రిరత్నాలు: బుద్ధుడు, ధర్మం, సంఘం. బుద్ధుడు ఈశ్వర ఉనికిపై మౌనం వహించి (అజ్ఞేయవాదం), ఆత్మ శాశ్వతత్వాన్ని తిరస్కరించాడు (అనాత్మవాదం), సమస్తం క్షణికమని ప్రతిపాదించాడు (క్షణికవాదం).
ప్రజా భాష అయిన పాళీ భాషలో బోధించడం వల్ల ప్రజల్లోకి శీఘ్రంగా విస్తరించింది. బుద్ధుని ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి. సంఘంలో మహిళలకు ప్రవేశం కల్పించిన తొలి విహారం వైశాలి (మహాప్రజాపతి గౌతమి తొలి భిక్షుణి).
