← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › బౌద్ధ మతం - గౌతమ బుద్ధుని జీవితం మరియు తత్వశాస్త్రం

జ్ఞానోదయం మరియు ధర్మచక్ర ప్రవర్తన

Topic 2 of 4 in బౌద్ధ మతం - గౌతమ బుద్ధుని జీవితం మరియు తత్వశాస్త్రం. Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

35వ ఏట బీహార్‌లోని గయ వద్ద నిరంజన (ఫల్గు) నదీ తీరాన రావి చెట్టు (బోధి వృక్షం) కింద 49 రోజుల ధ్యానం తర్వాత వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థునికి జ్ఞానోదయం లభించి 'బుద్ధుడు' (తథాగతుడు) అయ్యాడు.

సారనాథ్‌లోని డీర్ పార్క్ (రుషిపట్టణం) లో తన పూర్వపు ఐదుగురు సన్యాసి మిత్రులకు తొలి బోధన చేశాడు; దీనిని 'ధర్మచక్ర ప్రవర్తన' (చక్రం చిహ్నం) అంటారు.

తన 80వ ఏట ఉత్తరప్రదేశ్‌లోని కుశీనగరంలో చుందుడు సమర్పించిన ఆహారం తిని మరణించాడు; దీనిని 'మహాపరినిర్వాణం' (స్తూపం చిహ్నం) అంటారు.