బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు - క్రీ.పూ. 563 - 483).
కపిలవస్తు సమీపంలోని లుంబిని (నేపాల్) వనంలో శాక్య క్షత్రియ వంశంలో జన్మించాడు; తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి (మరణానంతరం పెంపుడు తల్లి గౌతమి పెంచింది), భార్య యశోధర, కుమారుడు రాహులుడు.
నాలుగు దృశ్యాలు (వృద్ధుడు, రోగి, శవం, ప్రశాంత సన్యాసి) చూసి తీవ్ర వైరాగ్యంతో 29వ ఏట రాత్రికి రాత్రే ఇల్లు విడిచాడు; ఈ సంఘటనను 'మహాభినిష్క్రమణం' (గుర్రం చిహ్నం) అంటారు. అలార కలామ, ఉద్రక రామపుత్రుల వద్ద సాంఖ్య, యోగ విద్యలు అభ్యసించాడు.
