బ్రిటిష్ వారు స్వదేశీ సంస్థానాలను రక్తం చిందకుండానే లొంగదీసుకోవడానికి రెండు కుతంత్ర విధానాలను రూపొందించారు. 1. 'సైన్యసహకార పద్ధతి' (Subsidiary Alliance): లార్డ్ వెల్లస్లీ (1798) దీనిని అత్యంత దూకుడుగా అమలు చేశాడు.
దీని ప్రకారం సంస్థానం తన సొంత సైన్యాన్ని రద్దు చేసుకుని బ్రిటిష్ సైన్యాన్ని ఉంచుకోవాలి, ఖర్చులను భరించాలి, బ్రిటిష్ రెసిడెంట్‌ను దర్బారులో ఉంచాలి మరియు ఇతర విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకోకూడదు.
ఈ విధానాన్ని అంగీకరించిన మొట్టమొదటి పాలకుడు హైదరాబాద్ నిజాం (1798), తరువాత మైసూర్ (1799), తంజావూరు (1799), అయోధ్య (1801), పీష్వా బాజీరావ్-II (1802).
2. 'రాజ్యసంక్రమణ సిద్ధాంతం' (Doctrine of Lapse): లార్డ్ డల్హౌసీ (1848 - 1856) దీనిని ప్రవేశపెట్టాడు. సహజ సిద్ధమైన మగ వారసులు లేని పక్షంలో దత్తత తీసుకునే హక్కును నిరాకరించి రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయడం దీని లక్ష్యం.
దీనికి బలైన తొలి రాజ్యం సతారా (1848), అనంతరం జైత్‌పూర్, సంబల్‌పూర్ (1849), భగత్ (1850), ఉదయపూర్ (1852), ఝాన్సీ (1853), నాగ్‌పూర్ (1854). అవధ్‌ను కుపరిపాలన సాకుతో (1856) కలుపుకున్నారు.
