మొఘల్ సామ్రాజ్య క్షీణత తర్వాత సుసంపన్నమైన బెంగాల్ ప్రాంతం బ్రిటిష్ వారి ప్రధాన లక్ష్యంగా మారింది. బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా కంపెనీ వాణిజ్య దుర్వినియోగాన్ని (దస్తక్‌లు), ఫోర్ట్ విలియం కోట విస్తరణను నిరసించాడు. ఇది క్రీ.శ.
1757 జూన్ 23న చారిత్రక 'ప్లాసీ యుద్ధం'కు దారితీసింది. రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్, రాయ్ దుర్లభ్, జగత్ సేథ్‌లతో కుట్రపన్ని సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ఓడించాడు. అనంతరం మీర్ జాఫర్, మీర్ ఖాసిమ్‌లను తోలుబొమ్మ నవాబులుగా మార్చారు.
స్వతంత్రంగా వ్యవహరించాలని చూసిన మీర్ ఖాసిం అయోధ్య నవాబ్ షుజావుద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలంతో చేతులు కలిపి 1764 అక్టోబర్ 22న 'బక్సార్ యుద్ధం' చేశాడు. హెక్టర్ మున్రో నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం సంయుక్త కూటమిని ఘోరంగా ఓడించింది.
1765 అలహాబాద్ సంధి ద్వారా మొఘల్ చక్రవర్తి బెంగాల్, బీహార్, ఒరిస్సాల దివానీ (రెవెన్యూ వసూలు) హక్కులను రాబర్ట్ క్లైవ్‌కు కట్టబెట్టాడు; క్లైవ్ బెంగాల్‌లో 'ద్వంద్వ పాలన' (Dual Government: 1765-1772) ప్రారంభించాడు.
