← All topic notes

ప్రధాన బ్రిటిష్ వైస్రాయ్‌లు మరియు వారి విధానాలు

By exambadi.inNote 03 / 04

1858 చట్టం తర్వాత పాలకులు వైస్రాయ్‌లుగా మారారు: 1. లార్డ్ కానింగ్ (1856 - 1862): చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్; 1857 తిరుగుబాటును ఎదుర్కొన్నాడు; 1858 విక్టోరియా రాణి ప్రకటన చదివాడు; ఇండియన్ పీనల్ కోడ్ (IPC - 1860) ఆమోదం. 2.

లార్డ్ లిట్టన్ (1876 - 1880): అత్యంత ప్రజావ్యతిరేక పాలకుడు; 1878 వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ (ప్రాంతీయ పత్రికల నోరు నొక్కడం), ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, భయంకర కరువు సమయంలో ఢిల్లీ దర్బార్ నిర్వహణ. 3.

లార్డ్ రిప్పన్ (1880 - 1884): 'భారతదేశపు మంచి వైస్రాయ్' (రిప్పన్ ది గుడ్); వర్నాక్యులర్ ప్రెస్ చట్టం రద్దు; 1881 మొదటి అధికారిక దశాబ్ద జనాభా లెక్కల సేకరణ; మొదటి ఫ్యాక్టరీ చట్టం (1881); 'భారత స్థానిక స్వపరిపాలన పితామహుడు' (1882 తీర్మానం); ఇల్బర్ట్ బిల్లు వివాదం.

4. లార్డ్ కర్జన్ (1899 - 1905): 1905 బెంగాల్ విభజన రూపశిల్పి; పురావస్తు శాఖ (ASI) పునరుద్ధరణ; విశ్వవిద్యాలయాల చట్టం.