← All topic notes

భారత గవర్నర్ జనరల్స్: సంస్కరణలు మరియు విలీనాలు

By exambadi.inNote 02 / 04

1833 చార్టర్ చట్టం ద్వారా భారతదేశం మొత్తానికి గవర్నర్ జనరల్ హోదా కల్పించబడింది. 1.

లార్డ్ విలియం బెంటింక్ (1828 - 1835): భారతదేశపు తొలి గవర్నర్ జనరల్; అత్యంత ఉదారవాది; 1829లో సతీ సహగమన నిషేధం, కల్నల్ స్లీమన్ ద్వారా థగ్గుల (దోపిడీ ముఠాలు) అణచివేత, శిశుహత్యల నిషేధం, మెకాలే సిఫార్సులతో ఆంగ్ల విద్యా ప్రవేశం (1835), కలకత్తా మెడికల్ కాలేజ్ స్థాపన.

2. లార్డ్ డల్హౌసీ (1848 - 1856): అత్యంత పిన్న వయస్కుడైన పాలకుడు; 'రాజ్యసంక్రమణ సిద్ధాంతం' (Doctrine of Lapse) అమలు చేసి సతారా, ఝాన్సీ, నాగ్‌పూర్ రాజ్యాలను లాక్కున్నాడు.

ఆధునిక మౌలిక వసతుల పితామహుడు: 1853లో మొదటి ప్యాసింజర్ రైలు (బొంబాయి నుండి థానే - 34 కి.మీ), టెలిగ్రాఫ్ లైన్ (కలకత్తా నుండి ఆగ్రా), ఆధునిక పోస్టల్ వ్యవస్థ (హాఫ్ అణా పోస్టల్ స్టాంపులు), పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) మరియు 1854 ఉడ్స్ డెస్పాచ్ అమలు చేశాడు.