← All topic notes

బెంగాల్ గవర్నర్ జనరల్స్: పునాదులు మరియు విస్తరణ

By exambadi.inNote 01 / 04

భారతదేశంలో బ్రిటిష్ పాలనా యంత్రాంగాన్ని నిర్మించిన తొలి పాలకులు: 1.

వారెన్ హేస్టింగ్స్ (1772 - 1785): బెంగాల్ తొలి గవర్నర్ జనరల్; ద్వంద్వ పాలన రద్దు, కలకత్తా సుప్రీంకోర్టు స్థాపన, ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఏర్పాటు (విలియం జోన్స్ - 1784), గీతను ఆంగ్లంలోకి అనువదించిన చార్లెస్ విల్కిన్స్‌ను ప్రోత్సహించాడు.

2. లార్డ్ కారన్‌వాలీస్ (1786 - 1793): 'భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు' మరియు పోలీస్ వ్యవస్థ సృష్టికర్త; 1793లో శాశ్వత శిస్తు పద్ధతి మరియు న్యాయ సంస్కరణల కోసం 'కారన్‌వాలీస్ కోడ్' తెచ్చాడు. 3.

లార్డ్ వెల్లస్లీ (1798 - 1805): 'బెంగాల్ టైగర్'గా పిలుచుకున్నాడు; స్వదేశీ రాజ్యాలను లొంగదీసుకోవడానికి 'సైన్యసహకార పద్ధతి'ని ప్రవేశపెట్టాడు; ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపించాడు. 4.

లార్డ్ హేస్టింగ్స్ (1813 - 1823): పిండారీలను అణచివేశాడు, మరాఠా సమాఖ్యను పూర్తిగా రద్దు చేశాడు.