స్వదేశీ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ సమావేశాలు మలుపు తిరిగాయి. 1905 బెనారస్ సమావేశానికి గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహించి బెంగాల్ విభజనను నిరసించారు.
1906 కలకత్తా సమావేశంలో దాదాభాయ్ నౌరోజీ కాంగ్రెస్ లక్ష్యం 'స్వరాజ్' అని ప్రకటించారు మరియు స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య తీర్మానాలను ఆమోదించారు.
1907 సూరత్ సమావేశంలో (రాష్‌బిహారీ ఘోష్ అధ్యక్షుడు) మితవాదులు, అతివాదుల మధ్య ఘర్షణ జరిగి కాంగ్రెస్ చీలిపోయింది.
1911 కలకత్తా సమావేశంలో (బిషన్ నారాయణ్ దార్ అధ్యక్షుడు) రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జనగణమన' గీతాన్ని తొలిసారిగా ఆలపించారు (వందేమాతరం తొలిసారి 1896 కలకత్తా సమావేశంలో రహిమతుల్లా సయానీ అధ్యక్షతన పాడబడింది).
1916 లక్నో సమావేశంలో (అంబికాచరణ్ మజుందార్ అధ్యక్షుడు) అతివాదులు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు మరియు చారిత్రక 'లక్నో ఒప్పందం' ద్వారా ముస్లిం లీగ్‌తో కాంగ్రెస్ చేతులు కలిపింది.
