← All topic notes

అష్టదిగ్గజాలు మరియు సాహిత్య వికాసం

By exambadi.inNote 06 / 15

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని 'భువనవిజయం' అని పిలిచేవారు. ఈ ఆస్థానంలో ఎనిమిది మంది గొప్ప తెలుగు కవులు ఉండేవారు, వీరిని 'అష్టదిగ్గజాలు' అంటారు.

  • అష్టదిగ్గజ కవులు మరియు రచనలు:
    1. అల్లసాని పెద్దన: 'ఆంధ్ర కవితా పితామహుడు'; ఈయన 'మనుచరిత్ర' మరియు 'హరికథాసారము' రచించాడు.
    2. నంది తిమ్మన: 'పారిజాతాపహరణం' కావ్యాన్ని రచించాడు (ముక్కు తిమ్మన అంటారు).
    3. ధూర్జటి: 'కాళహస్తి మహాత్మ్యము' మరియు 'కాళహస్తీశ్వర శతకము' రచించాడు.
    4. మాదయ్యగారి మల్లన: 'రాజశేఖర చరిత్రము' రచించాడు.
    5. అయ్యలరాజు రామభద్రుడు: 'రామాభ్యుదయము' రచించాడు.
    6. పింగళి సూరన: 'కళాపూర్ణోదయము' (తెలుగులో మొదటి కల్పిత కావ్యం) మరియు 'ప్రభావతీ ప్రద్యుమ్నము' రచించాడు.
    7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి): 'వసుచరిత్రము' రచించాడు.
    8. తెనాలి రామకృష్ణుడు: హాస్యచతురుడు; 'పాండురంగ మహాత్మ్యము' రచించాడు.
  • శ్రీకృష్ణదేవరాయల స్వంత రచనలు:
    1. తెలుగులో గోదాదేవి వివాహ కథాంశంతో 'ఆముక్తమాల్యద' (విష్ణుచిత్తీయము) అనే ఉత్తమ ప్రబంధాన్ని రాశాడు.
    2. సంస్కృతంలో 'జాంబవతీ కళ్యాణం' మరియు 'ఉషాపరిణయం' అనే నాటకాలను రచించాడు.