వేద సాహిత్యాన్ని 'శృతి' (విన్నది - దైవదత్తం, అపౌరుషేయం) అని పిలుస్తారు. తరతరాలుగా గురుశిష్య పరంపరలో శ్రవణం ద్వారా భద్రపరచబడింది. వేద వాఙ్మయం నాలుగు విభాగాలుగా విస్తరించింది: 1. సంహితలు (శ్లోకాల సమాహారం) 2.
బ్రాహ్మణాలు (యజ్ఞ యాగాదుల గద్య వివరణ) 3. అరణ్యకాలు (అడవుల్లో పఠించే తాత్విక గ్రంథాలు) 4. ఉపనిషత్తులు (జ్ఞానకాండ లేదా వేదాంతాలు). వేదాలు నాలుగు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం.
