17వ రాజు హాలుడు ప్రాకృత భాషలో 'గాథాసప్తశతి' అనే శృంగార కవితా సంకలనాన్ని రచించాడు (కవివత్సలుడు బిరుదు); హాలుని ఆస్థానంలో గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో 'బృహత్కథ' రచించాడు.
నాగార్జునకొండ వద్ద ఆచార్య నాగార్జునునికి యజ్ఞశ్రీ శాతకర్ణి మహావిహారాన్ని నిర్మించి ఇచ్చాడు. వాస్తుకళలో కార్లే, నాసిక్, భజే చైత్యాలు మరియు విహారాలు ప్రసిద్ధి.
అమరావతి స్తూపం పాలరాతి శిల్పాలకు, కథనాత్మక శిల్ప శైలికి (Amaravati School of Art) ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
