శాతవాహనులలో అత్యంత గొప్ప చక్రవర్తి 23వ రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 106 - 130). క్షహరాట వంశపు శక క్షత్రపుడు నహపాణుడిని ఓడించి అతని నాణేలను జోగల్‌తంబి వద్ద పునర్ముద్రించాడు.
తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన 'నాసిక్ ప్రశస్తి' ఇతడిని 'త్రిసముద్రతోయ పీతవాహన' (మూడు సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు), 'ఏకబ్రాహ్మణ', 'క్షత్రియ దర్పమాన మర్దన'గా కీర్తించింది.
24వ రాజు వాసిష్ఠీపుత్ర పులోమావి, 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి (నౌకా చిహ్నం గల నాణేలు జారీ చేశాడు). చివరి పాలకుడు మూడవ పులోమావి.
