షోడశ మహాజనపదాలలో మగధ అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా అవతరించడానికి అనేక కారణాలున్నాయి: 1. భౌగోళిక వ్యూహం: తొలి రాజధాని రాజగృహం ఐదు కొండలతో రక్షించబడగా, తర్వాతి రాజధాని పాటలీపుత్రం గంగ, శోణ్, గండక్ నదుల సంగమ వద్ద 'జలదుర్గం'గా నిలిచింది. 2.
సహజ వనరులు: రాజగిరి సమీపంలో సమృద్ధిగా ఇనుప ఖనిజ నిల్వలు ఆయుధాల తయారీకి ఉపకరించాయి. 3. సారవంతమైన గంగా ఒండ్రు మైదానాలు వ్యవసాయ మిగులును అందించాయి. 4. సైన్యంలో భారీ ఎత్తున ఏనుగుల వినియోగం మగధకు సైనిక ఆధిక్యతను చేకూర్చింది.
