బింబిసారుడు తన ఆస్థాన వైద్యుడు 'జీవకుడిని' అవంతి రాజు ప్రద్యోతునికి కామెర్ల చికిత్స కోసం ఉజ్జయినికి పంపాడు. అజాతశత్రువు కాలంలో మొదటి బౌద్ధ సంగీతి (రాజగృహ - క్రీ.పూ. 483), కాలpoolశోకుడి కాలంలో రెండవ బౌద్ధ సంగీతి (వైశాలి - క్రీ.పూ.
383) జరిగాయి. ధననందుని అపార సైనిక శక్తిని చూసి అలెగ్జాండర్ సైనికులు బియాస్ నది దాటడానికి భయపడ్డారు. చాణక్యుని సహాయంతో చంద్రగుప్తుడు ధననందుడిని కూలదోశాడు.
