హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు (శ్రేణిక); ఇతడు గౌతమ బుద్ధునికి సమకాలికుడు, అంగ రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు. వివాహ సంబంధాల (కోసల, లిచ్ఛవి, మద్ర) ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు.
బింబిసారుని కుమారుడు అజాతశత్రువు (కూణిక) తండ్రిని చంపి అధికారంలోకి వచ్చాడు. ఇతడు కోసల, వైశాలి (వజ్జి)లపై 16 ఏళ్లు యుద్ధం చేసి గెలిచాడు; ఈ యుద్ధంలో 'రథముసల', 'మహాశిలాకంటక' అనే అధునాతన ఆయుధాలను వాడాడు.
అజాతశత్రువు కుమారుడు ఉదయనుడు పాటలీపుత్ర నగరాన్ని స్థాపించి రాజధానిగా చేశాడు.
