మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణ పునరుజ్జీవనం ప్రారంభమైంది. మౌర్య సేనాని పుష్యమిత్ర శుంగుడు క్రీ.పూ. 185లో శుంగ వంశాన్ని స్థాపించాడు; ఇతడు రెండు అశ్వమేధ యాగాలు చేశాడు (పతంజలి మహర్షి ప్రధాన పురోహితుడు).
శుంగ చివరి రాజు దేవభూతిని చంపి వాసుదేవ కాణ్వుడు కాణ్వ వంశాన్ని స్థాపించాడు.
ఒడిశాలో చేతి వంశానికి చెందిన ఖారవేలుడు గొప్ప పాలకుడు; ఇతని సైనిక విజయాలను, జైన మత పోషణను భువనేశ్వర్ సమీపంలోని ఉదయగిరి కొండల్లో ఉన్న 'హాథీగుంఫా శాసనం' (ప్రాకృతంలో) వివరిస్తుంది.
