వాయవ్య భారత్‌లోకి విదేశీయుల వలసలు వెల్లువెత్తాయి: 1. ఇండో-గ్రీకులు (బాక్ట్రియన్లు): అత్యంత ప్రసిద్ధ రాజు మీనాండర్ (మిళిందుడు); బౌద్ధ సన్యాసి నాగసేనుని ద్వారా బౌద్ధం స్వీకరించాడు.
భారతదేశంలో తొలిసారిగా బంగారు నాణేలను, రాజు చిత్రాలు, తేదీలతో కూడిన నాణేలను జారీ చేసినవారు ఇండో-గ్రీకులే. 2. శకులు (సిథియన్లు): పశ్చిమ భారతదేశాన్ని పాలించిన పశ్చిమ క్షత్రపులలో రుద్రదామనుడు-1 (క్రీ.శ.
130-150) ప్రసిద్ధుడు; ఇతడు మౌర్యుల నాటి సుదర్శన తటాకాన్ని స్వంత ఖర్చుతో మరమ్మతు చేయించి, స్వచ్ఛమైన సంస్కృతంలో ప్రసిద్ధ 'జునాగఢ్/గిర్నార్ శిలాశాసనాన్ని' వేయించాడు.
