భారతదేశంలో ప్రాచీన శిలా యుగం (Palaeolithic Age) ప్లీస్టోసీన్ (మంచు యుగం) భౌగోళిక కాలంలో విస్తరించింది. మానవుడు ఆదిమ వేటగాడిగా, ఆహార సేకరణకర్తగా జీవించిన సుదీర్ఘ కాలమిది.
రాబర్ట్ బ్రూస్ ఫూట్ 1863లో మద్రాస్ సమీపంలోని పల్లవరంలో తొలి చేతిగొడ్డలిని (Handaxe) కనుగొనడంతో భారత చరిత్రపూర్వ యుగ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అందువల్ల ఆయన్ను 'భారత చరిత్రపూర్వ అధ్యయన పితామహుడు' అంటారు.
ఈ కాలం నాటి మానవుడిని హోమో ఎరెక్టస్ జాతికి చెందినవారిగా భావిస్తారు.
