పాత రాతియుగ మానవుడిని 'క్వార్ట్‌జైట్ మానవుడు' (Quartzite Men) అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముచ్చట్ల చింతమాను గవి (కర్నూలు) ఎగువ పాత రాతియుగానికి చెందిన ఎముకతో చేసిన పనిముట్లకు ప్రసిద్ధి.
నిప్పు కనిపెట్టబడినప్పటికీ నిత్య జీవితంలో విస్తృత వినియోగం చివరి దశలోనే జరిగింది. మధ్యప్రదేశ్ భీంబేట్కా గుహల్లో తొలి రాతి ఆశ్రయాలు కనుగొనబడ్డాయి. ఈ కాలం పూర్తిగా ఆహార అన్వేషణ దశ మాత్రమే.
