మలి వేద కాలపు పురావస్తు సంస్కృతిని 'పెయింటెడ్ గ్రే వేర్' (PGW - చిత్రిత బూడిద రంగు పాత్రల సంస్కృతి) అంటారు. హస్తినాపూర్, అహిచ్ఛత్ర, కౌశాంబిలలో పీజీడబ్ల్యూ స్థావరాలు బయల్పడ్డాయి.
హస్తినాపూర్ వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత రాజధానిని కౌశాంబికి మార్చారని ఆధారాలున్నాయి. ఈ కాలం చివరలో రెండవ పట్టణీకరణకు బలమైన ఆర్థిక పునాదులు పడ్డాయి.
