సింధు ప్రజల సంపదకు వ్యవసాయ మిగులే మూలకారణం. నదీ వరదలు మోసుకొచ్చే సారవంతమైన ఒండ్రు నేలల్లో వీరు పంటలు పండించారు. ప్రధాన పంటలు గోధుమ మరియు బార్లీ.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని (Cotton) పండించిన ఘనత హరప్పన్లదే; అందుకే గ్రీకులు పత్తిని 'సిండన్' (సింధు నుండి వచ్చినది) అని పిలిచారు. ఆవాలు, నువ్వులు, ఖర్జూరం, బఠానీలు కూడా పండించారు. చెక్క నాగళ్ళను ఉపయోగించారు.
