లోథాల్‌లోని కృత్రిమ నౌకాశ్రయం (Dockyard - ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన టైడల్ పోర్ట్) అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి కేంద్రం. ఖాలీబంగన్‌లో దున్నిన పొలం (Ploughed field) ఆనవాళ్ళు దొరికాయి. బనవాలీలో మట్టి నాగలి (Terracotta plough) లభించింది.
వీరు 16 గుణిజాల (16, 64, 160..) తూనికల పద్ధతిని వాడారు. నాణేలు లేవు; వస్తుమార్పిడి (Barter system) ద్వారా వ్యాపారం సాగింది. ఇనుము వీరికి పూర్తిగా తెలియదు.
