ఈ నాగరికత దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో వ్యాపించి ఉంది.
దీని సరిహద్దులు: ఉత్తరాన జమ్మూ కాశ్మీర్‌లోని మాండా (చీనాబ్ నది); దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ (ప్రవర/గోదావరి ఉపనది); తూర్పున ఉత్తరప్రదేశ్‌లోని ఆలంగీర్పూర్ (హిండన్ నది); పశ్చిమాన బలూచిస్తాన్ సరిహద్దులోని సుత్కాజెండోర్ (దాష్క్ నది).
భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ (షోర్టుఘై, ముండిగాక్) దేశాలలో విస్తరించి ఉంది.
