చన్హుదారో నగరానికి కోటగోడ (Citadel) లేదు. గుజరాత్‌లోని ధోలావీరా నగరం మూడు భాగాలుగా (కోట, మధ్య పట్టణం, దిగువ పట్టణం) విభజించబడిన ఏకైక నగరం; ఇక్కడ అద్భుతమైన రాతి రిజర్వాయర్లు, స్టేడియం బయల్పడ్డాయి.
బనవాలీలో క్రమబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ లోపించింది. లోథాల్‌లో తలుపులు ప్రధాన వీధి వైపు తెరుచుకునే ప్రత్యేకత ఉంది. హరప్పా పట్టణ ప్రణాళిక మున్సిపల్ అధికార వ్యవస్థ ఉనికిని స్పష్టం చేస్తుంది.
