← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › హరప్పా పట్టణ ప్రణాళిక మరియు భూగర్భ మురుగునీటి వ్యవస్థ

నిర్మాణ వస్తువులు మరియు ఇళ్ల నిర్మాణం

Topic 2 of 4 in హరప్పా పట్టణ ప్రణాళిక మరియు భూగర్భ మురుగునీటి వ్యవస్థ. Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

నిర్మాణాలలో ప్రామాణిక కొలతలు కలిగిన (నిష్పత్తి 4:2:1) కాల్చిన ఇటుకలను (Burnt bricks) విస్తృతంగా ఉపయోగించడం ఈ నాగరికత ప్రత్యేకత. సమకాలీన ఈజిప్ట్, మెసొపొటేమియాలలో ఎండబెట్టిన ఇటుకలు వాడగా, హరప్పన్లు కాల్చిన ఇటుకలు వాడారు.

ఇళ్ళు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు కలిగి, మధ్యలో పెరడు (Courtyard), దాని చుట్టూ గదులు, స్నానాల గది, బావి ఉండేవి. ప్రధాన వీధిలోకి తలుపులు తెరచుకోకుండా సందుల్లోకి తెరచుకోవడం వీరి భద్రతా స్పృహను సూచిస్తుంది.