హరప్పా సమాజం శాంతియుతమైన, వర్తక ఆధారిత పట్టణ సమాజం. ఇక్కడ ఎటువంటి సైనిక రాజ్య ఆనవాళ్లు లేదా ఆయుధాల కుప్పలు లభించలేదు. పాలక వర్గం వర్తక శ్రేణులై ఉండవచ్చని పండితుల అభిప్రాయం.
స్త్రీమూర్తుల విగ్రహాలు అధికంగా లభించడంతో సమాజం మాతృస్వామ్య లక్షణాలను కలిగి ఉండేదని భావిస్తున్నారు. ప్రజలు నూలు, ఉన్ని వస్త్రాలు ధరించేవారు. స్త్రీ, పురుషులిద్దరూ పూసల హారాలు, గాజులు, కర్ణాభరణాలు వంటి ఆభరణాలను అమితంగా ఇష్టపడేవారు.
