హరప్పన్లకు దేవాలయాలు లేవు. వీరు ప్రధానంగా మాతృదేవతను (Fertility Cult) ఆరాధించారు. మొహెంజొదారోలో లభించిన 'పశుపతి మహాదేవుని' ముద్రికలో యోగ ముద్రలో కూర్చున్న త్రిముఖ పురుష దేవుడు కనిపిస్తాడు.
ఈయన చుట్టూ కుడివైపు ఏనుగు, పులి; ఎడమవైపు ఖడ్గమృగం, అడవి గేదె; పాదాల వద్ద రెండు జింకలు ఉన్నాయి. దీనిని సర్ జాన్ మార్షల్ 'ప్రోటో-శివ'గా పేర్కొన్నారు. లింగ, యోని పూజ, రావి చెట్టు పూజ, మూపురం ఎద్దు మరియు పాము ఆరాధన ఆచరణలో ఉండేవి.
