మొహెంజొదారోలో కాంస్య నాట్యకత్తె విగ్రహం (Dancing Girl - లాస్ట్ వాక్స్ పద్ధతి), గడ్డంతో ఉన్న పూజారి రాతి విగ్రహం లభించాయి.
హరప్పాలో శవపేటిక ఖననం (R-37 మరియు H శ్మశానాలు), లోథాల్‌లో జంట సమాధులు (Double Burials), సుర్కోటడాలో కుండ ఖననం (Pot burials) కనిపించాయి. స్వస్తిక్ చిహ్నం మూలాలు సింధు నాగరికతలోనే ఉన్నాయి.
పశుపతి ముద్రికలో సింహం, గుర్రం లేకపోవడం పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న.
