మెగస్తనీస్ రచించిన 'ఇండికా' మౌర్యుల పరిపాలనను, పాటలీపుత్ర నగర పాలనను (30 మందితో కూడిన 6 బోర్డులు) వివరిస్తుంది; ఇతడు భారత సమాజంలో బానిసత్వం లేదని, సమాజం 7 తరగతులుగా విభజించబడిందని రాశాడు.
విశాఖదత్తుని 'ముద్రారాక్షసం' నాటకం నందులపై చాణక్యుని విజయ వ్యూహాలను వర్ణిస్తుంది. చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించి, భద్రబాహుతో కలిసి కర్ణాటకలోని శ్రావణబెళగొళకు వెళ్లి చంద్రగిరి కొండపై 'సల్లేఖన' వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేశాడు.
ఇతని కుమారుడు బిందుసారుడు (అమిత్రఘాత) అజీవక మతాన్ని ఆదరించాడు.
