వాయవ్య భారతదేశంలో రాజకీయ ఐక్యత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ దండయాత్రలు జరిగాయి. పర్షియాకు చెందిన అకెమెనిడ్ వంశ చక్రవర్తి సైరస్ మొదట దండయాత్ర చేయగా, డేరియస్-1 (దారయవహుస్) క్రీ.పూ.
518లో పంజాబ్, సింధు ప్రాంతాలను ఆక్రమించి తన సామ్రాజ్యంలో 20వ ప్రావిన్స్ (సత్రపి)గా మార్చాడు. ఈ ప్రావిన్స్ నుండి పర్షియా చక్రవర్తికి అత్యధికంగా 360 టాలెంట్ల బంగారు ధూళి వార్షిక కప్పంగా లభించేది.
పర్షియన్ల సంపర్కం దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది.
