మాసిడోనియా రాజు అలెగ్జాండర్ పర్షియా సామ్రాజ్యాన్ని జయించిన అనంతరం హిందూకుష్ పర్వతాలను దాటి క్రీ.పూ. 326లో భారతదేశంపై దండెత్తాడు. తక్షశిల పాలకుడు అంబి యుద్ధం చేయకుండానే లొంగిపోయాడు.
జీలం మరియు చీనాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ రాజు పురుషోత్తముడు (పోరస్) అలెగ్జాండర్‌ను తీవ్రంగా ప్రతిఘటించాడు. వీరి మధ్య జరిగిన పోరాటాన్ని 'జీలం యుద్ధం' లేదా 'హైడాస్పస్ యుద్ధం' (Battle of Hydaspes) అంటారు.
పోరస్ ధైర్యసాహసాలను మెచ్చిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చి మిత్రుడిగా చేసుకున్నాడు.
