నాల్గవ సంగీతిలో బౌద్ధం రెండు ప్రధాన శాఖలుగా చీలినది: 1. హీనయాన (చిన్న వాహనం/థెరవాద): సాంప్రదాయవాదం; బుద్ధుడిని మానవ గురువుగా భావించి చిహ్నాలను పూజిస్తారు; పాళీ భాష ప్రాధాన్యం (శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్‌లలో విస్తరణ). 2.
మహాయాన (పెద్ద వాహనం): బుద్ధుడిని దైవంగా భావించి విగ్రహారాధన ప్రారంభించారు, బోధిసత్వుల భావనను తెచ్చారు; సంస్కృత భాషను స్వీకరించారు (చైనా, జపాన్, కొరియాలలో విస్తరణ). 3. వజ్రయాన: క్రీ.శ.
5వ శతాబ్దంలో తాంత్రిక, మంత్ర శక్తులతో కూడిన నూతన శాఖ బెంగాల్, టిబెట్‌లలో ఆవిర్భవించింది; తార వీరి ప్రధాన దేవత.
