← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › బౌద్ధ సంగీతులు, సాహిత్య వికాసం మరియు శాఖలు

బౌద్ధ పవిత్ర సాహిత్యం - త్రిపీటకాలు

Topic 2 of 4 in బౌద్ధ సంగీతులు, సాహిత్య వికాసం మరియు శాఖలు. Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

పాళీ భాషలో రచించబడిన బౌద్ధ ధర్మ గ్రంథాలను 'త్రిపీటకాలు' (మూడు బుట్టలు) అంటారు. 1. వినయ పీఠకం: బౌద్ధ భిక్షువుల నిబంధనలు, క్రమశిక్షణను వివరిస్తుంది (ఉపాలి చేత క్రోడీకరణ). 2.

సుత్త పీఠకం: బుద్ధుని బోధనలు, ఉపన్యాసాల సమాహారం (ఆనందుని చేత క్రోడీకరణ); ఇందులో దిఘ, మజ్ఝిమ, సంయుక్త, అంగుత్తర, ఖుద్దక నికాయాలు ఉన్నాయి (జాతక కథలు ఖుద్దక నికాయంలో భాగం). 3.

అభిధమ్మ పీఠకం: బౌద్ధ తాత్విక, మానసిక విశ్లేషణ; మూడవ సంగీతిలో మొగలిపుత్త తిస్స 'కథావత్తు'ను ఇందులో చేర్చాడు.