దక్షిణ భారతదేశంలో క్రీ.పూ. 300 నుండి క్రీ.శ. 300 మధ్య కాలాన్ని తమిళ చరిత్రలో 'సంగం యుగం' అంటారు. 'సంగం' అనగా పాండ్య రాజుల రాజపోషణలో మధురై నగరంలో సమావేశమైన తమిళ కవులు, పండితుల పరిషత్ (Academy). మొత్తం మూడు సంగంలు జరిగాయి: 1.
మొదటి సంగం (మధురై) - అగస్త్య మహర్షి అధ్యక్షుడు (రచనలేవీ లభించలేదు) 2. రెండవ సంగం (కపటపురం) - తొల్కాప్పియర్ రచించిన 'తొల్కాప్పియం' (ప్రాచీన తమిళ వ్యాకరణ గ్రంథం) మాత్రమే లభించింది 3.
మూడవ సంగం (ఉత్తర మధురై) - నక్కీరర్ అధ్యక్షుడు; నేడు లభిస్తున్న సంగం సాహిత్యమంతా ఈ కాలానిదే.
