సంగం సాహిత్యం మూడు రాజవంశాలను 'మువేందర్లు'గా వర్ణించింది: 1. చేర రాజ్యం (కేరళ, పశ్చిమ తమిళనాడు): చిహ్నం విల్లు; రాజధాని వంజి; ప్రధాన రేవులు ముజిరిస్, తొండి.
గొప్ప రాజు శెంగోట్టువన్ (ఎర్ర చేరన్); ఇతడు 'పత్తిని కల్ట్' (కన్నగి/పతివ్రతా ఆరాధన) ప్రారంభించాడు. 2. చోళ రాజ్యం: చిహ్నం పులి; రాజధాని ఉరైయూరు (నూలు వస్త్రాల కేంద్రం), పుహార్/కావేరిపట్టణం రేవు.
గొప్ప రాజు కరికాల చోళుడు; వెన్ని యుద్ధ విజేత, కావేరి నదిపై 160 కి.మీ కల్లణై ఆనకట్టను నిర్మించాడు. 3. పాండ్య రాజ్యం: చిహ్నం చేప; రాజధాని మధురై, కొర్కై రేవు (ముత్యాలకు ప్రసిద్ధి); గొప్ప రాజు నెడుంజెలియన్.
