సంగం యుగపు రెండు గొప్ప మహాకావ్యాలు: 1. 'శిలప్పదికారం' (కాలి అందెల కథ) - ఇళంగో అడిగల్ రచించాడు; కోవలన్, కన్నగి, మాధవిల విషాద కథ. 2. 'మణిమేఖలై' - సీత్తలై సత్తనార్ రచించాడు (బౌద్ధ ప్రభావం గల కావ్యం).
రోమన్ సామ్రాజ్యంతో ముజిరిస్ రేవు ద్వారా భారీగా నల్ల మిరియాలు (యవనప్రియ) ఎగుమతి అయ్యేవి. అగస్టస్ సీజర్ దేవాలయం ముజిరిస్‌లో నిర్మించబడింది. మురుగన్ (సుబ్రహ్మణ్యేశ్వరుడు) ప్రాచీన తమిళుల ప్రధాన దైవం.
