← All topic notes

కార్యాచరణ పద్ధతులు (3P విధానం) మరియు డిమాండ్లు

By exambadi.inNote 03 / 04

మితవాదులు తమ లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగబద్ధమైన, అహింసాయుత పద్ధతులను అవలంబించారు. దీనిని '3Pల విధానం' అంటారు: 1. ప్రేయర్స్ (Prayers - వినతులు), 2. పిటిషన్లు (Petitions - అర్జీలు), 3. ప్రొటెస్టులు (Protests - తీర్మానాల ద్వారా నిరసనలు).

వీరు తీవ్రవాద పోరాటాలను, సామూహిక ప్రజా ఉద్యమాలను వ్యతిరేకించారు.

వీరి ప్రధాన డిమాండ్లు: భారతీయుల కోసం శాసన మండళ్లలో ప్రాతినిధ్యం పెంచడం, భారత్ మరియు ఇంగ్లాండ్‌లలో ఒకేసారి ICS సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించడం (వయోపరిమితి పెంపు), న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుండి వేరు చేయడం, సైనిక వ్యయాన్ని తగ్గించడం, ఉప్పు పన్ను రద్దు చేయడం, భారత సంపద దోపిడీని నిలిపివేయడం.

లండన్‌లో భారత వాణిని వినిపించడానికి 1889లో 'బ్రిటిష్ కమిటీ ఆఫ్ INC' ఏర్పాటైంది (ఇండియా పత్రిక నిర్వహణ).