← All topic notes

భారత జాతీయ కాంగ్రెస్ (INC) స్థాపన మరియు నేపథ్యం

By exambadi.inNote 01 / 04

19వ శతాబ్దపు ద్వితీయార్థంలో రవాణా, సమాచార సాధనాలు, ఆంగ్ల విద్య వ్యాప్తి వల్ల అఖిల భారత స్థాయి రాజకీయ చైతన్యం పెరిగింది.

లార్డ్ లిట్టన్ అణచివేత చర్యలు (1878 వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్) మరియు ఇల్బర్ట్ బిల్లు వివాదం (1883 - భారతీయులైన న్యాయమూర్తులు బ్రిటిష్ వారిని విచారించవచ్చనే ప్రతిపాదనను తెల్లజాతి వారు తీవ్రంగా వ్యతిరేకించడం) జాతీయవాదాన్ని రగిల్చాయి.

బ్రిటన్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారి అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ (A.O. Hume) చొరవతో 1885 డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్‌దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాలలో 'భారత జాతీయ కాంగ్రెస్' ఏర్పడింది. దీని తొలి సమావేశానికి డబ్ల్యూ.సి. బెనర్జీ (W.C.

Bonnerjee) అధ్యక్షత వహించగా దేశం నలుమూలల నుండి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. లార్డ్ డఫ్రిన్ ఆ సమయంలో వైస్రాయ్‌గా ఉన్నాడు (లాాలా లజపత్‌రాయ్ దీనిని 'సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతం'గా విమర్శించాడు).