1857 తిరుగుబాటు అనంతరం వచ్చిన చట్టాలు పరిపాలనలో మార్పులు తెచ్చాయి: 1.
భారత ప్రభుత్వ చట్టం 1858: కంపెనీ పాలనను రద్దు చేసి అధికారాన్ని బ్రిటిష్ రాణికి బదిలీ చేసింది; బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దయ్యాయి; సెక్రటరీ ఆఫ్ స్టేట్ (భారత రాజ్య కార్యదర్శి) పదవి మరియు 15 మంది సభ్యుల ఇండియన్ కౌన్సిల్ ఏర్పాటైంది; గవర్నర్ జనరల్‌కు 'వైస్రాయ్' హోదా లభించింది.
2. ఇండియన్ కౌన్సిల్స్ చట్టం 1909 (మింటో-మార్లే సంస్కరణలు): ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు (Separate Electorates) కేటాయించింది; వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో చేరిన తొలి భారతీయుడు ఎస్.పి. సిన్హా. 3.
భారత ప్రభుత్వ చట్టం 1919 (మాంటేగు-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు): ప్రావిన్సులలో ద్వంద్వ పాలనను (Dyarchy - రిజర్వ్‌డ్ మరియు ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్టులు) ప్రవేశపెట్టింది; కేంద్రంలో ద్విసభా విధానాన్ని (Bicameralism), ప్రత్యక్ష ఎన్నికలను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును సూచించింది.
