బ్రిటిష్ పార్లమెంట్ ప్రతి 20 ఏళ్లకొకసారి కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరిస్తూ నాలుగు చార్టర్ చట్టాలను చేసింది: 1. చార్టర్ చట్టం 1793: కంపెనీ హక్కులను మరో 20 ఏళ్లు పొడిగించింది. 2.
చార్టర్ చట్టం 1813: భారతదేశంలో కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది (కేవలం టీ వాణిజ్యం మరియు చైనాతో వాణిజ్యం మినహా); క్రైస్తవ మిషనరీలకు భారత్‌లో మత ప్రచారానికి అనుమతిచ్చింది; భారతీయ విద్యాభివృద్ధికి ఏటా లక్ష రూపాయలు కేటాయించింది.
3.
చార్టర్ చట్టం 1833: టీ మరియు చైనా వాణిజ్యంతో సహా కంపెనీ పూర్తి వాణిజ్య గుత్తాధిపత్యాన్ని రద్దు చేసి కేవలం పరిపాలనా సంస్థగా మార్చింది; బెంగాల్ గవర్నర్ జనరల్‌ను 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చి దేశ పరిపాలనను పూర్తిగా కేంద్రీకరించింది (లార్డ్ విలియం బెంటింక్ మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా); లార్డ్ మెకాలే నేతృత్వంలో లా కమిషన్ ఏర్పాటైంది.
4. చార్టర్ చట్టం 1853: సివిల్ సర్వీసెస్‌లో నియామకాల కోసం బహిరంగ పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది.
