← All topic notes

మధ్యయుగపు మలుపులు: తరైన్ మరియు మూడు పానిపట్ యుద్ధాలు

By exambadi.inNote 02 / 04

మధ్యయుగ రాజకీయ చిత్రపటాన్ని మార్చినవి: 1. మొదటి తరైన్ యుద్ధం (1191) - పృథ్వీరాజ్ చౌహాన్ ముహమ్మద్ ఘోరీని ఓడించాడు; రెండవ తరైన్ యుద్ధం (1192) - ఘోరీ పృథ్వీరాజ్‌ను ఓడించి ముస్లిం సామ్రాజ్యానికి పునాది వేశాడు. 2.

మొదటి పానిపట్ యుద్ధం (1526 ఏప్రిల్ 21) - బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ పాలనను స్థాపించాడు. 3. రెండవ పానిపట్ యుద్ధం (1556 నవంబర్ 5) - అక్బర్ సేనాని బైరామ్ ఖాన్ హేమును ఓడించి మొఘల్ రాజ్యాన్ని పునరుద్ధరించాడు. 4.

తళ్ళికోట యుద్ధం (1565 జనవరి 23) - దక్కన్ సుల్తానుల సంయుక్త కూటమి విజయనగర సైన్యాన్ని ఓడించి రాజధాని హంపిని ధ్వంసం చేసింది. 5.

హల్దీఘాటి యుద్ధం (1576 జూన్ 18) - అక్బర్ సైన్యాధ్యక్షుడు మాన్‌సింగ్ మరియు మేవార్ రాణా ప్రతాప్ సింగ్ మధ్య అసంపూర్ణంగా ముగిసిన భీకర పోరాటం. 6. మూడవ పానిపట్ యుద్ధం (1761 జనవరి 14) - అహ్మద్ షా అబ్దాలీ మరాఠా సైన్యాన్ని తుత్తునియలు చేశాడు.