← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › వేదాంగాలు, స్మృతులు మరియు షడ్దర్శనాలు

స్మృతి సాహిత్యం మరియు న్యాయ చట్టాలు

Topic 3 of 4 in వేదాంగాలు, స్మృతులు మరియు షడ్దర్శనాలు. Read this note, then practice its questions.

By exambadi.inNote 03 / 04

స్మృతులు ప్రాచీన భారతీయ ధర్మశాస్త్రాలు లేదా పౌర, నేర న్యాయస్మృతులు. వీటిలో 'మనుస్మృతి' (మానవ ధర్మశాస్త్రం) అత్యంత ప్రాచీనమైనది; దీనిపై మేధాతిథి, కుల్లూకభట్టు వ్యాఖ్యానాలు రాశారు.

యాజ్ఞవల్క్య స్మృతి ఆస్తి హక్కులలో స్త్రీలకు వెసులుబాటు కల్పించింది; దీనిపై విజ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యానమే ప్రసిద్ధ 'మితాక్షర' న్యాయ చట్టం (బెంగాల్, అస్సాం మినహా దేశమంతా అమలులో ఉంది). జిమూతవాహనుడి 'దాయభాగ' చట్టం బెంగాల్‌లో అమలైంది.

నారద, పరాశర స్మృతులు ఇతర ముఖ్య గ్రంథాలు.