బలూచిస్తాన్‌లోని మెహర్‌గఢ్ (బోలాన్ పాస్ వద్ద) భారత ఉపఖండంలోనే అత్యంత ప్రాచీన వ్యవసాయ స్థావరం (క్రీ.పూ. 7000); ఇక్కడ గోధుమ, బార్లీ పంటలు, పచ్చి ఇటుకల ఇళ్లు బయల్పడ్డాయి.
కాశ్మీర్‌లోని బుర్జహోమ్‌లో భూగర్భ నివాసాలు (Pit dwellings), యజమానితో పాటు పెంపుడు కుక్కను సమాధి చేసే ఆచారం కనిపించాయి. గుఫ్‌క్రాల్ (కుమ్మరి గుహ) మరో ముఖ్య కాశ్మీర్ సైట్.
బీహార్‌లోని చిరాండ్‌లో భారీ సంఖ్యలో జింక కొమ్ములతో చేసిన ఎముక పనిముట్లు లభించాయి.
