వ్యవసాయ మిగులును నిల్వ చేయడానికి మరియు ఆహారాన్ని వండటానికి మట్టిపాత్రల అవసరం ఏర్పడింది. కుమ్మరి చక్రం (Potter's Wheel) ఆవిష్కరణ మానవ ప్రగతికి ఊతం ఇచ్చింది.
చేతితో చేసిన కుండల నుండి చక్రంపై చేసిన నునుపైన కుండలు, నలుపు-ఎరుపు పాత్రల వాడకం పెరిగింది. ప్రత్తి మరియు నారతో దుస్తులు నేయడం, గడ్డితో చాపలు అల్లడం, ఎముకతో సూదులు, పనిముట్లు తయారు చేయడం ప్రారంభమైంది. సమాజంలో శ్రమ విభజన పురుడుపోసుకుంది.
