← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › తొలి వేద సమాజం, సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థ

వర్ణ వ్యవస్థ ఆవిర్భావం

Topic 2 of 4 in తొలి వేద సమాజం, సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థ. Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

తొలి వేద కాలంలో సమాజ వర్గీకరణ వృత్తి ఆధారంగా మాత్రమే ఉండేది కానీ పుట్టుక ఆధారంగా కాదు. వర్ణవ్యవస్థ సరళంగా, గతిశీలంగా ఉండేది.

ఋగ్వేదంలో ఒక వ్యక్తి 'నేను కవిని, నా తండ్రి వైద్యుడు, నా తల్లి తిరగలి విసిరేది' అని చెప్పుకోవడం శ్రమ గౌరవాన్ని సూచిస్తుంది.

ఋగ్వేద చివరి దశలో రచించబడిన 10వ మండలంలోని 'పురుష సూక్తం'లో మాత్రమే ఆదిపురుషుని విరాట్ స్వరూపం నుండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు ఉద్భవించాయనే ప్రస్తావన తొలిసారి కనిపిస్తుంది.