ఆర్యుల స్వస్థలంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, మాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన 'మధ్య ఆసియా' సిద్ధాంతం అత్యంత ఆమోదయోగ్యమైనది. బోగజ్-కోయ్ (టర్కీ) శాసనంలో ఇంద్ర, వరుణ, మిత్ర, నాసత్య వేద దేవతల పేర్లు ఉండటం దీనిని ధ్రువీకరిస్తుంది.
ఆర్యులు తొలుత స్థిరపడిన ప్రాంతాన్ని 'సప్తసింధు' (ఏడు నదుల దేశం - సింధు, వితస్తా/జీలం, అసిక్ని/చీనాబ్, పరుష్ణి/రావి, విపాస్/బియాస్, శతుద్రి/సట్లెజ్, సరస్వతి) అంటారు. ఋగ్వేదంలో సింధు అత్యధికంగా, సరస్వతి అత్యంత పవిత్రమైన నదిగా వర్ణించబడ్డాయి.
