← All topic notes

జాతీయ కాంగ్రెస్ మరియు అతివాద ఉద్యమ నినాదాలు

By exambadi.inNote 02 / 04

భారత స్వాతంత్ర్య సమరంలో ప్రజలను ఏకం చేయడానికి పలు శక్తివంతమైన నినాదాలు వెలువడ్డాయి. 1870లలో బంకించంద్ర ఛటర్జీ తన 'ఆనందమఠ్' నవలలో రాసిన 'వందేమాతరం' 1905 స్వదేశీ ఉద్యమంలో యావత్ జాతిని కదిలించిన మంత్రంగా మారింది.

బాలగంగాధర తిలక్ 1916 హోమ్‌రూల్ ఉద్యమ సమయంలో గర్జించిన 'స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించి తీరుతాను' (Swaraj is my birthright and I shall have it) అనే నినాదం యువతలో ఆత్మగౌరవాన్ని రగిల్చింది.

దాదాభాయ్ నౌరోజీ కాంగ్రెస్ వేదికపై నుండి 'స్వరాజ్' సాధనే అంతిమ లక్ష్యమని చాటారు. మహమ్మద్ ఇక్బాల్ 1904లో రాసిన 'సారే జహాఁ సే అచ్ఛా హిందూసితాఁ హమారా' అనే దేశభక్తి గీతం భారతీయ సమగ్రతకు ప్రతీకగా నిలిచింది.